![](https://anakapallidistrictpolice.in/wp-content/uploads/2024/12/pressmeetakp-1024x682.jpg)
అనకాపల్లి జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన
డౌనూరు ఎన్.డీ.పీ.ఎస్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు
నర్సీపట్నం, నవంబర్ 19: గంజాయి అక్రమ రవాణా ను అరికట్టేందుకు కొయ్యూరు మండలం, డౌనూరు వద్ద ఉన్న ఎన్.డీ.పీ.ఎస్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు
ఆకస్మికంగా తనిఖీ చేసి, విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మమేకమై రిజిస్టర్లో నమోదు కాబడిన వాహనాలు వివరాలు ఎక్కడి నుండి ఎటువైపు వెళుతున్నవి తదితర వివరాలను తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకుని, అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రత్యక్షంగా జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షించి తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి సిబ్బందికి తెలియజేశారు.
ఈ అకస్మిక తనిఖీలలో ఎస్పీ గారితో పాటు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ జి.ఆర్.ఆర్. మోహన్, నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గోవిందరావు తదితరులు వెంట ఉన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం,
అనకాపల్లి.