అనకాపల్లి జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన
అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాల సహాయంతో చెక్ — అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్.,

  • సిబ్బందికి డ్రోన్లు ఆపరేటింగ్ పై ప్రత్యేక శిక్షణ, మెళకువలు
  • జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుండీ డ్రోన్లు ఆపరేటింగు కోసం సిబ్బంది కేటాయింపు
  • జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధుల్లో డ్రోన్లు ఎగురవేసేలా విస్తరింపు – జిల్లా ఎస్పీ

అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు, డ్రోన్లతో చెక్ పెట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్.,
గారు ఆదేశించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుండీ డ్రోన్లు ఆపరేటింగు కోసం ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయించారు మరియు వారికి డ్రోన్లు ఆపరేటింగ్ పై ప్రత్యేక శిక్షణ, మెళకువలు నేర్పించి ఈ రోజు జిల్లా ఎస్పీ గారు డ్రోన్ లను అందజేశారు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ – గంజాయి రవాణా జరుగు దారులను గుర్తించుటకు , తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను డ్రోన్ ద్వారా గుర్తించి తదుపరి ప్రణాళికను సిద్దం చేయుటకు , సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించుటకు, పండగ బందోబస్తు మరియు ఇతర బందోబస్తుల్లో ఎంతోగాను ఉపయోగపడతాయి. అంతకాకుండా ట్రాఫిక్ నియంత్రణకు, బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ మరియు రద్దీగా ఉండే ప్రదేశాలలో డ్రోన్లు ద్వారా నిఘా చేయుటకు ఎంతో దోహదపడుతాయన్నారు. ప్రముఖుల బందోబస్తు, అధికంగా జనం గుమిగూడే కార్యక్రమాలలో కూడా నేరస్తులపై నిఘా వేయవచ్చన్నారు. కొన్ని సందర్భాలలో పోలీసులు భౌతికంగా వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్లను పంపి అక్కడి పరిస్థితులను సమీక్షించుకునే వీలుంటుందన్నారు.
అంతేకాకుండా…. ఓపెన్ డ్రింకింగ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం… పేకాట ఆడటం, గంజాయి సేవించడం, అమ్మాయిలను ఈవ్ టీజ్ చేయడం, ఒంటరిగా వెళ్లే మహిళలు కావచ్చు లేదా వ్యక్తులునైనా బెదిరించడం, చోరీలకు పాల్పడటం, చైన్ స్నాచింగ్ చేసి పరారవ్వడం… ఇలా నేరాలకు పాల్పడేవారికి డ్రోన్లతో చెక్ పెట్టవచ్చన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల విజువల్స్ డ్రోన్లలో సేవ్ అవుతాయన్నారు.
ఈ కార్యకమంలో శ్రీమతి టి. కళ్యాణి , సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, 
అనకాపల్లి.