ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా , సబ్బవరం మండలం లో గల స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం నందు నిర్వహించిన సమావేశములో గౌరవనీయులు శ్రీ గోపీనాధ్ జెట్టి, ఐపీఎస్., విశాఖపట్నం రేంజ్ డిఐజి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సైబర్ నేరములకు సంబందించి మరియు డ్రగ్స్ కి సంబందించిన పోస్టర్స్ ని విద్యార్దులు కి ప్రదర్శిస్తూ, కార్యక్రములో పాల్గొన్న వారితో మాదకద్రవ్యములుకి అలవాటు పడబోము అని, వాటి వలన కలిగే దుష్ప్రభావములు ను నా తోటి వారికి చెప్పి వారిని కూడా డ్రగ్స్ బారిన పడకుండా చేసేదను అని ప్రతీ వారితో ప్రతిజ్ఞ చేయించారు. దేశ అభిరుద్దికి విద్యార్ధులు అతి ముఖ్యమైన వారు కావున డ్రగ్స్ నిర్మూలన దేశంగా మన దేశమును, మన రాష్ట్రం ను తీర్చిదిద్దాలి అని గౌరవ డీఐజి గారు సమావేశంలో తెలియజేశారు.