ABHAYA

మహిళలపై జరిగే నేరాలను గుర్తించండి – అప్రమత్తంగా ఉండండి!

Online loan app scams trick users into providing personal and financial details, often charging hidden fees or exploiting the information for fraud.

Never share OTPs via electronic media to protect against fraud and identity theft.

Be cautious of fake apps promising high returns; they are often scams.

Be cautious with QR codes; scammers may use them to steal your information or money.

Before taking a loan, verify the lender’s legitimacy, understand the terms, avoid upfront fees, read reviews, and ensure you can afford repayment.

Don’t open emails from unknown senders to avoid scams and malware.

Cyber crime portal number : 1930

Cyber crime portal link : https://cybercrime.gov.in/

“మహిళలకు అభయం – సమాజానికి గౌరవం”

అనకాపల్లి జిల్లా పోలీసుల సరికొత్త వినూత్న సేవ: ‘అభయ’ ఘనంగా ప్రారంభం
నక్కపల్లి, జూలై 15, 2026: మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత ధ్యేయంగా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “అభయ” ప్రత్యేక కార్యక్రమమును బుధవారం నాడు నక్కపల్లి సమీపంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద గల భారతీ కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
 

ఈ వినూత్న కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ వేదికపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, IAS గారు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారు, మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ శౌర్య మాన్ పటేల్, IAS గారు గౌరవ సమక్షులుగా పాల్గొన్నారు.
 

మహిళల రక్షణే ప్రథమ ప్రాధాన్యత: 

ఈ సందర్భంగా గౌరవ హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ, మహిళల రక్షణే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటించారు. ‘అభయ’ కార్యక్రమం ద్వారా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ మహిళల రక్షణ కోసం ఒక అద్భుతమైన కవచాన్ని నిర్మించిందని, మహిళలు ఏ సమయంలోనైనా భయం లేకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.

మూడు శాఖల సమన్వయం – సురక్షిత ప్రాంతాల ఏర్పాటు: 

అనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, IAS గారు ప్రసంగిస్తూ,   జిల్లాలో మహిళా సాధికారత, భద్రతను పటిష్టం చేయడానికి ఈ ‘అభయ’ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, ఈ అద్భుతమైన చొరవను తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

కేవలం పోలీసుల పరంగానే కాకుండా, జిల్లా యంత్రాంగం తరఫున రెవెన్యూ, పోలీస్, మరియు మహిళా-శిశు సంక్షేమ శాఖల (WCD) సమన్వయంతో తామంతా కలిసి పనిచేస్తామని, క్షేత్రస్థాయిలో ప్రతి మహిళకు అత్యంత వేగవంతమైన సేవలు, భద్రత అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

‘మీ భద్రత… మా బాధ్యత’ & తగ్గిన నేరాల శాతం: 

జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారు మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ‘మీ భద్రత… మా బాధ్యత’ అనే నినాదంతో ఈ ‘అభయ’ ప్రాజెక్టును అత్యంత ప్రణాళికాబద్ధంగా తీసుకువచ్చామని తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీసుల నిరంతర కృషి ఫలితంగా జిల్లాలో మొత్తం నేరాల రేటు 28.42% మేర తగ్గడం  విశేషమని ఆయన గర్వంగా ప్రకటించారు.

ఈ ప్రాజెక్టు కింద మొత్తం 10 ప్రధానాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెబుతూ, స్కూళ్లు, కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘శక్తి బీట్’ అధికారులను, శక్తి టీమ్స్ మరియు ఉమెన్ సేఫ్టీ బీట్స్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తున్నామని వివరించారు. బాధితులకు గృహాల వద్దే కౌన్సిలింగ్ ఇవ్వడం, నిరంతరం వేధించే నేరస్థులపై  రౌడీ షీట్లు తెరవడం, సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు మరింత బాసటగా నిలిచేందుకు ‘వన్ స్టాప్ సెంటర్’ మరియు కదలికల ద్వారా అవగాహన కల్పించే ‘అవేర్‌నెస్ ఆన్ వీల్స్’ సేవలను కూడా జోడించామని వివరించారు.

ఈ ‘అభయ’ కార్యక్రమం ప్రధానంగా 5 రక్షణ సూత్రాలపై నడుస్తుంది:  

నివారించండి: సమాజ భాగస్వామ్యం, రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా వాడకం ద్వారా మహిళలపై జరిగే నేరాలను ముందస్తుగా నియంత్రిస్తారు.

రక్షించండి: ఆపద సమయంలో తక్షణ రక్షణ మరియు భద్రతను చేకూరుస్తారు.

అండగా ఉండండి: బాధితులకు మానసిక, వైద్య మరియు చట్టపరమైన భరోసా కల్పిస్తూ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తారు.

న్యాయం చేయండి: సత్వర దర్యాప్తు జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చార్జ్‌షీట్లు దాఖలు చేస్తారు.

శక్తివంతం చేయండి: చట్టాలపై విస్తృత అవగాహన కల్పించి మహిళల ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను పెంచుతారు.

మహిళలపై జరిగే నేరాలను గుర్తించండి – అప్రమత్తంగా ఉండండి!

Online loan app scams trick users into providing personal and financial details, often charging hidden fees or exploiting the information for fraud.

Never share OTPs via electronic media to protect against fraud and identity theft.

Be cautious of fake apps promising high returns; they are often scams.

Be cautious with QR codes; scammers may use them to steal your information or money.

Before taking a loan, verify the lender’s legitimacy, understand the terms, avoid upfront fees, read reviews, and ensure you can afford repayment.

Don’t open emails from unknown senders to avoid scams and malware.

Cyber crime portal number : 1930

Cyber crime portal link : https://cybercrime.gov.in/